సింగిల్ సాంగ్ కోసం 18 కోట్ల బడ్జెట్ .!

ఈ మధ్య కాలంలో సినిమా నిర్మాణం చాలా ఎక్కువైంది. ఒకప్పుడు తక్కువ బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించిన నిర్మాతలు ఇప్పుడు కోట్లకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. సౌత్ లో బాహుబలి చిత్రం తర్వాత అంత బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 2.0. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్, అమీజాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ అంతా ఎప్పుడో పూర్తి కాగా, ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇటీవల ఆ సాంగ్ చిత్రీకరణ మొదలు పెట్టారు. చెన్నైలోని ఎఆర్ రెహమాన్ స్టూడియోలో డ్యూయెట్ సాంగ్ ని దాదాపు 18 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారని టాక్. రెండు రోబోల మధ్య సాగే ఈ సాంగ్ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని తీసుకొస్తుందని అంటున్నారు. అక్టోబర్ 27న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్స్ దగ్గరున్న పార్క్ లో ఆడియో వేడుక నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Related Stories: