రోల్డ్ గోల్డ్ బంగారం చూయించి రూ.5లక్షలు ఎత్తుకెళ్లారు

నారాయణపేట : మాయమాటలతో కొద్దిరోజుల పాటు సెల్‌ఫోన్ సంభాషణలతో ఓ మహిళతో పాటు ఓ యువకుడిని నమ్మించి రోల్డ్‌గోల్డ్ బంగారు నగలను చూయించి రూ.5 లక్షలను ఎత్తుకెళ్లిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట పట్టణంలోని పాతగంజ్ సమీపంలో తిరుమల లేడీస్ కార్నర్‌ను లక్ష్మి నిర్వహిస్తుంది. అయితే కొద్ది రోజుల కిందట మధ్యప్రదేశ్‌కు చెందిన కొండరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి పరిచయం చేసుకొని మాయమాటలు చెప్పారు. తాము రోడ్డు పనులు చేస్తుంటామని.. ఈ క్రమంలో పని చేస్తుండగా బంగారం దొరికిందని దాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామని ఆమెకు మాయమాటలు చెప్పారు. రూ.5 లక్షలు డిమాండ్ చేసి ఆమెకు రోల్డ్‌గోల్డ్ నగలను అంటగట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత వాటిని పరిశీలించగా రోల్డ్‌గోల్డ్‌గా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

Related Stories: