నగరిలో రోజా విజయం

న‌గ‌రి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి అభ్య‌ర్థి రోజా మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. త‌న స‌మీప ప్రత్య‌ర్థి గాలి భాను ప్ర‌కాష్ (టీడీపీ)పై రోజా 2681 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో రోజా టీడీపీ అభ్య‌ర్థి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలిచారు. కాగా గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు అనారోగ్యంతో క‌న్ను మూయ‌గా, ఆయ‌న కుమారుడు గాలి భాను ప్ర‌కాష్ టీడీపీ త‌ర‌ఫున న‌గ‌రి బ‌రిలో నిలిచారు.