చిరుత‌ల‌తో పైథాన్ ఫైట్‌.. వీడియో

జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌: ఓ కొండ చిలువ ఒక చిరుత‌, దాని పిల్ల‌తో ఫైట్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్‌గా మారిపోయింది. సౌతాఫ్రికాలోని క్రూగర్ నేష‌న‌ల్ పార్క్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను కొంద‌రు టూరిస్టులు కెమెరాలో బంధించారు. నిజానికి గ‌తేడాది జులైలో ఈ వీడియో తీసినా.. దానిని ఈ నెల 3న ఆన్‌లైన్లో పోస్ట్ చేశారు. ఈ నేష‌న‌ల్ పార్క్‌లో రాక్ పైథాన్‌లు దూకుడుకి మారుపేరు. అలాంటి పైథాన్‌తో ఆట‌లాడ‌టానికి ప్ర‌య‌త్నించింది ఓ చిరుత పిల్ల‌. దాన్ని నోటితో అమాంతం మింగేయ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అది త‌ప్పించుకుంది. ఇంత‌లో త‌ల్లి చిరుత బిడ్డ‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఆ పైథాన్ దాన్ని క‌రిచింది. ఈ భ‌యాన‌క ఫైట్‌ను చిత్రీక‌రిస్తున్న టూరిస్టులు భ‌యంతో అర‌వ‌డం వీడియోలో వినిపిస్తుంది. ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ అయిన కొన్ని రోజుల్లోనే 2 లక్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి.
× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు