ఆఫ్ఘన్‌లో ఘోర రోడ్డుప్రమాదం

-16 మంది దుర్మరణం.. 25 మందికి గాయాలు కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాందహార్ రాష్ట్రం జహ్రీ జిల్లా సమీపంలో ప్రయాణికుల బస్సును ట్యాంకర్ ఢీకొట్టడంతో 16 మంది మృతిచెందగా.. 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. క్షత గాత్రులకు అధికారులు సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్సనిందిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యంవల్లె దేశంలోని ప్రధానరహదారులపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధ్వానస్థితిలో ఉన్న రోడ్లు కూడా ప్రమాదాలకు మరో కారణం.

Related Stories: