డిప్రెషన్‌తో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్

రాంచీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్.. డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని రాంచీలోని రాజేంద్ర ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరక్టర్ ఆర్కే శ్రీవాత్సవ్ తెలిపారు. దాణా కుంభకోణం కేసులో ముద్దాయిగా తేలిన లాలూ.. ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే జైలులో ఉన్న లాలూ.. మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. మాజీ బీహార్ సీఎం డిప్రెషన్‌లో ఉన్నట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు. గత బుధవారం రిమ్స్‌లోని పేయింగ్ రూమ్‌కు లాలూను తరలించారు. జైలు అధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత లాలూ రూమ్‌ను మార్చారు. జైలు నుంచి కొన్ని నెలల పాటు పెరోల్‌పై వచ్చిన లాలూ మళ్లీ ఆగస్టు 30వ తేదీన జైలుకు వెళ్లారు. కానీ మెడికల్ కారణాలు చెబుతూ ఆయన హాస్పటల్లోనే ఉంటున్నారు.

Related Stories: