ప్రజాతీర్పును గౌరవించడం అందరి బాధ్యత: చంద్రబాబు

ఎన్నికల్లో అద్బుతమైన విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎంగా రాజీనామా సమర్పించిన అనంతరం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..దేశమంతా లెక్కింపు పూర్తయి ఫలితాలు వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడం అందరి బాధ్యత. వైఎస్సార్పీపీ అధినేత జగన్‌కు మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాత్రింబవళ్లు పనిచేసిన టీడీపీ కార్యకర్తలకు నా అభినందనలు. ఈ ఫలితాలను సమీక్షించుకుంటామని చంద్రబాబు అన్నారు.