అటవీ కళాశాలలో ఆచార్యపోస్టుల భర్తీ

-24 కొలువుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్.. -నేటినుంచి దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో 24 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయనున్నట్టు పేర్కొన్నది. మంగళవారం నుంచి అక్టోబర్ పదివరకు దరఖాస్తు చేసు కోవాలని, వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.