రిలయన్స్ విలువ 8 లక్షల కోట్లు

ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం మరో ఘనతను సొంతం చేసుకుంది. తొలిసారి ఆ సంస్థ మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లను తాకింది. గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో ఆర్‌ఐఎల్ షేరు విలువ రూ.1262.50కు చేరుకుంది. షేరు ధర ఒక్కరోజే రూ.16 పెరిగింది. దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.8,00,128.29 కోట్లకు చేరుకుంది. ఇది మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు రిలయన్స్ జియో కూడా లాభాల బాట పట్టింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జియో నికర లాభాలు 19.9 శాతం వృద్ధి చెంది రూ.612 కోట్లకు చేరడం విశేషం.

గతేడాది ఇదే త్రైమాసికంలో జియో రూ.21.27 కోట్ల నష్టాలను సంస్థ చూపించింది. జూన్ చివరినాటికి జియోకు 21.53 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఏడాది వ్యవధిలోనే కస్టమర్ల సంఖ్య రెట్టింపు కావడం విశేషం. జియో నెట్‌వర్క్‌లో ఒక యూజర్ సగటున నెలకు 10.6 జీబీ డేటాను వాడుతున్నట్లు గుర్తించారు. నెలకు ఒక్కో యూజర్‌పై జియోకు వస్తున్న సగటు ఆదాయం రూ.134.5గా ఉంది.

Related Stories: