ఎల్లుండే జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్.. ఎక్కడ కొనాలంటే..

ముంబై: రిలయెన్స్ జియో ఫోన్ ఇండియా ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పటికే లక్షల మంది జియో ఫోన్‌ను వాడుతున్నారు. ఇప్పుడదే జియో ఫోన్ హై ఎండ్ మోడల్‌ను తీసుకొచ్చింది రిలయెన్స్. దీనికి సంబంధించిన ఫ్లాష్ సేల్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఆగస్ట్ 16న అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ ఉంటుంది. జియో అధికారిక వెబ్‌సైట్ అయిన జియో.కామ్‌లో ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ ఉంటుంది. దీని ధరను రూ.2999గా నిర్ణయించిన విషయం తెలిసిందే. క్వెర్టీ కీప్యాడ్‌తో జియో ఫోన్ 2 వస్తున్నది.

జియో ఫోన్ డిస్‌ప్లేకు పూర్తి భిన్నంగా ఈ ఫోన్‌లో హారిజాంటల్ డిస్‌ప్లేను తీసుకొచ్చారు. ఇక ముందుగానే చెప్పినట్లు ఆగస్ట్ 15 నుంచి జియో ఫోన్‌లో ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్ యాప్స్‌లాంటి ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. త్వరలోనే వాట్సాప్ కూడా రానున్నట్లు జియో ప్రకటించింది. రిలయెన్స్ ఈ మధ్యే మాన్‌సూన్ హంగామా ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద యూజర్లు తమ పాత ఫీచర్‌ను ఇచ్చి కేవలం రూ.501కే జియో ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

Related Stories: