వివో స్మార్ట్‌ఫోన్లపై జియో క్యాష్‌బ్యాక్ బొనాంజా

టెలికాం సంస్థ జియో కొత్తగా వివో స్మార్ట్‌ఫోన్లను కొనే యూజర్లకు క్యాష్‌బ్యాక్ బొనాంజా ఆఫర్‌ను అందిస్తున్నది. వివో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు జియో రూ.1200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. అందులో రూ.600 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వోచర్ల రూపంలో ఉంటుంది. మరో రూ.600 క్యాష్‌బ్యాక్ యూజర్ల జియో మనీ వాలెట్‌లో జమ అవుతుంది. దీనికి తోడు కొత్త వివో ఫోన్లలో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 ప్లాన్లను వాడితే వారికి అదనంగా 120 జీబీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి