జియో ఆఫర్.. కస్టమర్లందరికీ ఉచితంగా 16 జీబీ డేటా..!

రిలయన్స్ జియో తన కస్టమర్లందరికీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తన వినియోగదారులందరికీ ఉచితంగా 16 జీబీ డేటాను అందిస్తున్నట్లు జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో 2 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు రెండు వోచర్లు వస్తాయి. ఒక్కో వోచర్‌లో 8 జీబీ డేటా వస్తుంది. ఈ డేటాను కస్టమర్లు రోజుకు 2 జీబీ చొప్పున 4 రోజుల్లో ఉపయోగించుకోవాలి. ఈ నెల 20వ తేదీ లోపు ఒక వోచర్ కస్టమర్‌కు లభిస్తుంది. దాన్ని వారు రిడీమ్ చేసుకుంటే డేటా లభిస్తుంది. ఇక మరో వోచర్‌ను అక్టోబర్ నెలలో జియో ఇవ్వనుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. కస్టమర్లు తమ తమ ఫోన్లలో మై జియో యాప్‌లోకి వెళ్లి మై ప్లాన్స్ సెక్షన్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

Related Stories: