అగ్రస్థానంలో రిలయన్స్ జియో మొబైల్ సబ్‌స్ర్కైబర్లు

న్యూఢిల్లీ : జూన్ నెలాఖరుకు దేశంలో మొబై ల్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 116.8 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ వెల్లడించింది. మేనెలలో సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 115.35 కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో కొత్తగా 97 లక్షల సబ్‌స్ర్కైబర్లను పొంది అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఐడియా 63 లక్షల కొత్త వినియోగదారులతో రెండో స్థానంలోనూ ఉంది. వోడాఫోన్ 2.75 లక్షలు, బీఎస్‌ఎన్‌ఎల్ 2.44 లక్షలు, ఎయిర్‌టెల్ 10,689 కొత్త వినియోగదారులను పొందాయి. కాగా, ఆర్‌కామ్ 1.08 లక్షల మంది వినియోగదారులను కోల్పోగా, ఎంటీఎన్9,615 మందిని కోల్పోయిందని ట్రాయ్ నివేదిక వెల్లడించింది. బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్ర్కైబర్లు 43.2 కోట్ల నుంచి 44.71 కోట్లకు పెరిగారు.

Related Stories: