జియో మరో బంపర్ ఆఫర్.. రూ.399 ఆపైన రీచార్జిలకు రూ.3300 వరకు క్యాష్ బ్యాక్..!

రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లకు న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మధ్యే ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ముగియగా దాని స్థానంలో 'సర్‌ప్రైజ్ క్యాష్ బ్యాక్' పేరిట మరో కొత్త ఆఫర్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ప్రకారం రూ.399 ఆపైన విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు రూ.3300 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
జియో సర్‌ప్రైజ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకారం రూ.399 ఆపైన విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుంటే రూ.400 విలువ గల 8 వోచర్లు లభిస్తాయి. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలపై ఒక్కసారి ఒక వోచర్‌ చొప్పున‌ వాడుకోవచ్చు. అలాగే జియో పార్ట్‌నర్ వాలెట్స్ అయిన అమెజాన్ పే, పేటీఎం, మొబిక్విక్, ఫోన్ పే, యాక్సిస్ పే, ఫ్రీ చార్జి లలో రీచార్జి చేసుకుంటే రూ.30 మొదలుకొని రూ.300 వరకు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు కస్టమర్లకు రూ.2600 విలువైన గ్రోఫర్స్, ఓయో, యాత్రా, పేటీఎం మాల్, బిగ్ బాస్కెట్, జూమ్ కార్ స్పెషల్ వోచర్లు లభిస్తాయి. ఈ క్రమంలో కస్టమర్లకు లభించే మొత్తం క్యాష్ బ్యాక్ రూ.400+రూ.300+రూ.2600=రూ.3300 అవుతుంది. ఇక ఆ ఆఫర్‌కు గడువును జనవరి 15 గా నిర్ణయించారు.

Related Stories: