రేపటితో నాగార్జునసాగర్‌కు పునాదిరాయి పడి 63 ఏళ్లు..

నాగార్జునసాగర్‌: ఇరు తెలుగు రాష్ర్టాలకు సాగు, తాగునీరందించే ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు పునాదిరాయి పడి రేపటికి 63 ఏళ్లు గడవనున్నాయి. ప్రాజెక్టు రేపటితో 64వ వసంతంలోకి అడుగిడనుంది. ఈ ప్రాంత రైతులు కరువుతో అలమటిస్తున్న సమయంలో ముక్త్యాల కోట రాజైన రాజా రామగోపాల్ కృష్ణ మహేశ్వరప్రసాద్ ఆలోచనతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు బీజం పడింది. కృష్ణా నదిపైన పులిచింతల వద్ద ప్రాజెక్టు కట్టేందుకు అనువుగా ఉందని 1908లో బ్రిటీష్ ఇంజినీర్లు కర్నల్ ఎల్లిస్, కర్నల్ సీటీ మార్లింగ్స్ ప్రతిపాదించినా అప్పట్లో దాని నిర్మాణం జరుగలేదు. అనంతరం ఖోస్లా కమిటీ సూచనలతో 1954 డిసెంబర్ 17న అప్పటి గవర్నర్ త్రివేది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రకటించారు. 1955 డిసెంబర్ 10 న అనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మణానికి పైలాన్ పిల్లర్ వద్ద శంకుస్థాపన చేశారు.

Related Stories: