జనసేన రాజోలు అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం

ఏపీ ఎన్నికల్లో ఎట్టకేలకు జనసేన పార్టీ ఖాతా తెరిచింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. రాజోలు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం నుంచి చివరి రౌండ్ వరకు ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. కౌంటింగ్ ముగిసే సమయానికి రాపాక వరప్రసాద్ స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. జనసేన పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించడంతో..పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వరప్రసాద్‌కు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. పవన్‌కళ్యాణ్ బీమవరం, గాజువాక రెండు స్థానాల్లో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.