ఏ పార్టీ అధ్యక్షుడు ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు: రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. దేశ చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడు ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే.. భారత ప్రధాని మోదనీ దొంగ అంటున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. రాఫెల్ విమానాలను రూ. 500 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో రాఫెల్ విమానాల కాంట్రాక్టునే రద్దు చేసుకున్నారు. 2012లోనే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం జరిగింది. కాంగ్రెస్ హయాంలో ఒప్పందం జరిగితే తామెలా కొనుగోలు చేస్తున్నట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం కంటే 9 శాతం తక్కువ ధరకు ఒప్పందం జరిగిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే వెల్లడించారని తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో రాహుల్‌గాంధీ భేటీ అంశాన్ని ఆయన కొట్టిపారేశారు. దేశంలో బ్యాంకులను కొల్లగొట్టింది ఎవరో ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిరాధార ఆరోపణలను దేశ ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని పేర్కొన్నారు.

Related Stories: