శ్రీవారిని దర్శించుకున్న రతన్ టాటా

తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా, ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ జేఈఓ దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయించారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం అందించి, తీర్ధ ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందచేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎంపీ కేసినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ను పెట్టనున్నారని అన్నారు. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ ను రతన్ టాటా నిర్మించనున్నారు. ప్రజల ఆరోగ్యం బాగుండాలనే నేపథ్యంలో రతన్ టాటా ఈ హాస్పిటల్ కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని తెలిపారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Related Stories: