తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రతన్ టాటా

తిరుపతి: తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఎపీ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నిజపాదా సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు రతన్ టాటాకు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి రతన్ టాటాను పట్టువస్త్రంతో సత్కరించారు. తదనంతరం టీటీడీ కేటాయించిన భూమిలో టాటా ట్రస్ట్ సహకారంతో రాష్ట్రప్రభుత్వం నిర్మిచబోతున్న క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి తిరుపతికి పయనం అయ్యారు.

Related Stories: