నేను త‌ప్పుకోవ‌డం లేదు: ర‌త‌న్ టాటా

ముంబై: టాటా ట్ర‌స్ట్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తాను త‌ప్పుకోబోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ర‌త‌న్ టాటా ఖండించారు. ఈ మేర‌కు టాటా స‌న్స్ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. టాటా ట్ర‌స్ట్స్ జాతిని ప్ర‌భావితం చేసే ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంద‌ని, వాటిని ముందుకు తీసుకుపోవాల‌ని ర‌త‌న్ టాటా భావిస్తున్నార‌ని ఆ ప్ర‌క‌ట‌నలో టాటా స‌న్స్ చెప్పింది. అయితే స‌రైన స‌మ‌యంలో నాయ‌క‌త్వ మార్పు ప్ర‌క్రియ చేపట్టాల‌ని టాటా అనుకుంటున్న‌ట్లు తెలిపింది. ర‌త‌న్ టాటా చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నార‌ని, కొత్త చైర్మ‌న్ ఎంపిక ప్ర‌క్రియ కోసం టాటా ట్ర‌స్ట్స్ ఓ క‌న్స‌ల్టెంట్‌ను సంప్ర‌దించిన‌ట్లు ట్ర‌స్టీల్లో ఒక‌రైన ఆర్కే క్రిష్ణ కుమార్ చెప్పిన‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన టాటా స‌న్స్‌.. అలాంటిదేమీ లేద‌ని స్ప‌ష్టంచేసింది. title=/
× RELATED వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం