నేడు లక్డీకాపూల్ జంక్షన్ ప్రారంభం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ చేపట్టిన జంక్షన్ల సుందరీకరణలో భాగంగా లక్డీకాపూల్ జంక్షన్‌లో కర్రల వంతెన నమూనాను నిర్మించారు. దీన్ని ఈనెల 22వ తేదీన నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ మేయర్‌తోపాటు, కార్పొరేటర్లు పాల్గొంటారని అధికారులు తెలిపారు. జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా రూ.30.50 లక్షల వ్యయంతో ఈ జంక్షన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నమూనా కర్ర వంతెన ఏర్పాటుతో గతంలోని లక్డీకాపూల్ గుర్తుకు వస్తుందని, అంతేకాకుండా అయోధ్య జంక్షన్ మ రింత సుందరంగా రూపొందినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సంగీత్, సుచిత్ర, లక్డీకాపూల్ జంక్షన్లను ప్రారంభించగా, గురువారం లక్డీకాపూల్‌లోని మరో జంక్షన్‌ను ప్రారంభించనున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఎల్బీనగర్ చింతలకుంట జంక్షన్‌ను కూడా ప్రారంభించనున్నారు.
More