గాంధీ ది సోల్ ఫోర్స్ వారియర్ పుస్తకావిష్కరణ

ఖైరతాబాద్: ప్రముఖ గాంధేయ వాది, మాజీ భారత రాయబారి పాస్కల్ అలెన్ నజ రచించిన గాంధీ ది సోల్ ఫోర్స్ వారియర్ పుస్తకాన్ని సోమాజిగూడలో అడ్మినిస్టేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో ఆస్కీ చైర్మన్, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ అహింస ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన గాంధీజీ ఆ ఆయుధాన్ని ప్రపం చ దేశాలకు అందించారన్నారు. కేవలం స్వాతంత్రోద్యమమే కాదు యాజమాన్య నిర్వహణ (మేనేజ్‌మెంట్)లోనూ ఆయన దిగ్గజమన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్కీ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు రిచర్డ్ సల్దానా, డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ నిర్మల, ఆస్కీ ఎడిటర్, ప్రజా సంబంధాల మేనేజర్ డాక్టర్ ఎస్. రాము పాల్గొన్నారు.
More