మూసీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

గోల్నాక : మూసీ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేశ్ కథ నం ప్రకారం.. సోమవారం ఉదయం గోల్నాక మూసీలో గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు జీహెచ్‌ఎంసీ డిసాస్టర్ ఫోర్స్ సహకారంతో కుళ్లిన మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 45 ఏండ్లు ఉంటాయని... మృతుడి చేతికి రాఖీతో పాటు మెడలో హనుమాన్ లాకెట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. రెండు రోజుల క్రితమే ప్రమాదవశాత్తు మూసీలో పడ్డాడా?, లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైన ఉంటే అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
More