ఆత్మగౌరవంతో బతికేందుకే రెట్టింపు ఆసరా

-నాడు 200..నేడు 2వేలు -తెలంగాణ వచ్చిన తర్వాత భారీగా పెరిగిన పింఛన్లు -ప్రభుత్వానికి ప్రజలే బాసులు మంత్రి తలసాని -గరీబుల కోసమే కేసీఆర్ సర్కారు హోంమంత్రి మహమూద్ అలీ -తెలంగాణ సర్కారు తల్లిలాగా ఆదరిస్తున్నది బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ -లబ్ధిదారులకు రవీంద్రభారతిలో పింఛను మంజూరు పత్రాల అందజేత -ముఖ్యమంత్రికి మనసారా కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా ఫించన్ల పెంచి భరోసాను ఇచ్చిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం గడ్డిఅన్నారం డివిజన్ సాయి ఫంక్షన్ హాల్‌లో హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలోని ఆసరా పెన్షన్ దారులకు పెరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వృద్ధులకు ఇంటి పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ మారాడన్నారు. వృద్ధులతో పాటు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృత్తి కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించడమే కాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండింతలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పేద ప్రజలకు అండగా నిలువడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోని వృత్తిదారులను కూడా ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు రూ. 2.70 కోట్లు పొందేవారని, ప్రస్తుతం రూ 4.80 కోట్లను అందజేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు చెరుకు సంగీతాప్రశాంత్‌గౌడ్, కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, పద్మానాయక్, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న, జీవీ సాగర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, భవానీ ప్రవీణ్‌కుమార్, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, సామ రమణారెడ్డి, ఉప కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేదల అభివృద్ధికి పాటుపడుతున్నారని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ అన్నారు. శనివారం నాంపల్లి నియోజకవర్గం మెహిదీపట్నం హుమాయూన్‌నగర్‌లో ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ అందచేశారు.
More