రేపు సబ్సిడీ ధరలకు అశ్వగంధ విత్తనాల పంపిణీ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాట్స్ బోడుప్పల్‌లోని తమ సంస్థ రిసర్చ్ కేంద్రంలో సోమవారం అశ్వగంధ విత్తనాలను సబ్సిడీ ధరకు రైతులకు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ స్టేట్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు సహకారంతో విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, ఆసక్తి గల రైతులు తమ భూమి పత్రాలు, ఆధార్ కార్డు, రెండు ఫొటో లు, లీజ్ అగ్రిమెంట్లను సోమవారం సంస్థ కేంద్రంలో అందజేసి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విత్తనాలు తీసుకోవాలని సూచించారు. విత్తనాల స్టాక్ పరిమితంగా ఉండడంతో, ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వాళ్లకే విత్తనాలు అందుతాయని వివరించారు. వివరాలకు ఫోన్: 9550095095కు ఫోన్ చేయాలని సూచించారు.
More