ఒక్క ఫిర్యాదు..ఆలస్యానికి చెల్లు

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ : నగరానికి చెందిన రాంబాబుకు (పేరుమార్పు) నగరంలో ప్లాస్టిక్ కుర్చీల పరిశ్రమ ఉంది. తన కంపెనీలో తయారవుతున్న కుర్చీలను డీలర్ కొనుగోలు చేశాడు.1000 కుర్చీలను డీలర్ తీసుకెళ్లి డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడంతో రాంబాబు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని డీలర్‌ను ఎన్నిసార్లు అడిగినా చెల్లించండంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడు. రాంబాబుకు ఏం చేయాలో తోచకపోవడంతో(తెలియక) సంవత్సరాల తరబడి డీలర్ వద్ద రావాల్సిన బకాయి డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరిగినా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో తాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూక్ష్మ, చిన్నర తరహా పరిశ్రమల యాక్ట్-2006 ద్వారా సెక్షన్ 27 ప్రకారం పరిశ్రమలకు ఆలస్యపు చెల్లింపుల ఫిర్యాదు కేంద్రాన్ని ఆశ్రయించాడు. రాంబాబు వంటి వాళ్ల సమస్య పరిష్కరించేందుకు మేము ఉన్నామంటున్నారు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్ రంగారెడ్డి రీజియన్ (ఎంఎస్‌ఈఎఫ్‌సీ) అధికారులు. ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్న వారు నేరుగా కానీ, samadhaan.msme.gov.in కు రావాలని ఆహ్వానం పలుకుతున్నారు. ఆన్‌లైన్‌లో సైతం బాధితులు ఫిర్యాదులు చేయవచ్చు. ఉత్పత్తిదారుడు శ్రేయస్సే ముఖ్యంగా ఫెసిలిటేషన్ కౌన్సిల్ పనిచేస్తుంది. చిన్న, చిరు పరిశ్రమదారులు, కొనుగోలుదారులకు వస్తువులు, సేవలు అందించి దానికి రావాల్సిన డబ్బులు 45 రోజుల్లో రాకపోవడం జరిగితే వారు పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్ రంగారెడ్డి రీజియన్ (ఎంఎస్‌ఈఎఫ్‌సీ)లో ఫిర్యాదు చేస్తే ఇద్దరి మధ్య రాజీ కుదర్చడం, మధ్యవర్తత్వం చేస్తారు. అందరీ సమక్షంలో రాజీ చేయాల్సి ఉంటుంది. రాజీకానీ కేసులు చట్టబద్ధంగా మధ్యవర్తత్వం వహించిన పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఇచ్చిన తీర్పును అమలు చేయకపోతే కొనుగోలు దారులు కోర్టుకు వెళ్లినా పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్ తీర్పునే పాటించాలని ఆదేశిస్తారు. లేదంటే ఆ కేసులను విచారించాలంటే కొనుగోలుదారుడు ఉత్పత్తిదారుడికి చెల్లించాల్సిన దాంట్లో (ఫెసిలిటేషన్ కౌన్సిల్) అర్డర్‌లో ఉన్న 75% డబ్బులను జిల్లా ప్రిన్సిపల్ సెసన్స్ కోర్టు అకౌంట్‌లో జమా చేస్తేగానీ కోర్టు ఆ కేసును ఫైల్ చేయద్దు. మొత్తం మీద మ్రైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సెలింగ్‌తో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇది కొనుగోలు దారుడు చేయకపోతే ఉత్పత్తిదారుడు అతడిపై చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించవచ్చు. పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్‌లో.. పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్‌లో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చైర్మన్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రస్థాయిలో మాత్రమే ఉండేది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూక్ష్మ, చిన్నరతహా పరిశ్రమల యాక్ట్-2006 ద్వారా సెక్షన్ 27 ప్రకారంతో రీజియన్లను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఎనిమిది జిల్లాలను ఒక రీజియన్‌గా ఏర్పాటు చేశారు. చైర్మన్, కార్యదర్శిగా పరిశ్రమల శాఖ అధికారులు ఉంటారు. లీడ్ బ్యాంకు మేనేజర్,ఎస్‌ఎఫ్‌సీ వారు సభ్యులు,పరిశ్రమల సంఘం(అసోసియేషన్)లతో పాటు ఇతర కమిటీ సభ్యులుగా కొనసాగుతారు.
More