మెట్రో రికార్డ్

- ఒకే రోజు 2.60 లక్షల మంది ప్రయాణం సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మెట్రోరైలు మరో రికార్డు నెలకొల్పింది. బుధవారం (ఏప్రిల్ 17)న 2.60 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైటెక్‌సిటీ మార్గం అందుబాటులోకి వచ్చాక ప్రతీరోజు 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రతీ వారం 4 వేల మం ది ప్రయాణికులు పెరుగుతున్నారని చెప్పారు.2.60 లక్షల్లో 9 వేల పేపర్‌టికెట్లు ఐపీఎల్ కోసం విక్రయించినట్లు తెలిపారు. 2.60 లక్షల మంది ప్రయాణికుల్లో ఐపీఎల్ చూడటానికి వెళ్లే ప్రయాణికులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. హైటెక్‌సిటీ, దుర్గం చెరువు స్టేషన్ల నుంచి 12 ఐటీ కంపెనీలు షటిల్ బస్సులు నడుపుతున్నాయని చెప్పారు. దుర్గం చెరువు స్టేషన్ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా ఉచిత షటిల్ బస్సులను ఎల్ అండ్‌టీ మెట్రోరైలు గురువారం ప్రారంభించిందని తెలిపారు. 15 నిమిషాలకోసారి మెర్రీ గో రౌండ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు

Related Stories: