రేపటి నుంచి తరుణి ఎగ్జిబిషన్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/వెంగళ్‌రావునగర్: హైదరాబాద్ మెట్రోరైలు ఆధ్వర్యంలో సరికొత్త ప్రదర్శ నకు వేదికగా మధురానగర్ స్టేషన్ మారబోతుంది. మహిళా స్టేషన్‌గా ప్రకటించిన మధురా నగర్ తరుణి స్టేషన్‌లో ఈ నెల 20 తేదీ నుంచి మహిళలచే తరుణి ఫేయిర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 60 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో పల్లె వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు. తరుణి ఫేయిర్ ఏర్పాట్లు పరిశీలించడానికి గురువారం మధురానగర్ తరుణి స్టేషన్‌కు వచ్చిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారిత, సమానత్వం కోసం మెట్రోస్టేషన్ నిర్వ హణను మహిళలకు అప్పగించినట్లు తెలిపారు. పూర్తిగా మహిళలతో తయారుచేసిన ఉత్ప త్తులు మాత్రమే విక్రయిస్తారని, పిండివంటలతోపాటు చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొత్తం 150 స్టాళ్లు ఏర్పాటు చేశామని అందులో 50 స్టాళ్లను మెప్మాకు అప్పజెప్పామన్నారు. ముఖ్యంగా క్యాటరింగ్‌కు సంబంధించిన పదార్ధాలతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కు కూడా అవకాశం ఉందన్నారు. ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు తెరి చి ఉంటుందని, కనుమరుగై పోయిన కులవృత్తులతోపాటు చాలా విషయాలను నేటి తరం పిల్లలు తెలుసుకోవచ్చన్నారు. పూర్తిస్థాయి సీసీటీవీల పర్యవేక్షణలో నిఘా ఉంటుందని తెలిపారు. ఫుడ్‌కోర్టులో , అమ్యూజ్‌మెంట్ పార్కులు, సరిపడా పార్కింగ్ సౌకర్యం తో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, ఉదయం 6 నుంచి 7 గంటల వరకు యోగా కూడా నేర్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలి పారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు బ్యాచ్‌లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొ న్నారు. ఆసక్తి ఉన్నవారు 040-23388588,23388587 నంబర్లకు ఈ నెల 24 తేదీ లోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పేయింటింగ్, డ్రాయింగ్‌తోపాటు ఇతర కళల్లో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎన్వీఎస్ వెల్లడించారు. న్యాక్‌తో బాలికలకు వివిధ వృత్తులలో శిక్షణ ఇస్తామన్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ పేరిణి నాట్యం, ఒగ్గుడోలు, చిందు యక్షగానం, ఒగ్గుకథ, బుర్రకథ, జానపద నృత్యాలు, కూచిపూడి,కథక్, కోలాటంతోపాటు తెలంగాణ పాటలతో ప్రదర్శన ఉంటాయని స్పష్టం చేశారు. మెట్రోరైలు డీసీపీ బాలకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, సాయినాథ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
More