ఎయిర్ ఫోర్స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రానా..!

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ డం అందుకున్నాడు రానా. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపధ్యంలో ‘1945’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయ‌నున్నాడు రానా. ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించనున్నాడు . ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది. 1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఇవే కాక గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్యకశ్యప అనే చిత్రం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. బాల డైరెక్షన్లోను రానా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. వీటి త‌ర్వాత నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన తేజ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడు రానా. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాలో రానా ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రుగుతుండగా, త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
× RELATED 65 ఏండ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో..