క‌మ‌ల్ హాస‌న్‌ తో రానా సెల్ఫీ

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాసన్‌ని సామాన్యులే కాదు సినీ సెల‌బ్రిటీలు కూడా ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. క‌మ‌ల్ ద‌గ్గ‌ర నుండి నేర్చుకోవ‌ల‌సింది ఎంతో ఉంద‌ని నేటి త‌రం క‌థానాయ‌కులు ప‌లుమార్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా రానా క‌మ‌ల్‌తో క‌లిసి సెల్ఫీ దిగి ఆ ఫోటోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. మీరు ఒక సంవత్సరంలో నేర్చుకున్నదానికన్నా ఎక్కువ గంటలలో నేర్చుకున్నారు అంటే మీరు స్వ‌యంగా లెజెండ్‌ని క‌లిసార‌ని అర్దం అంటూ కామెంట్ పెట్టాడు. ఈ రోజు క‌మ‌ల్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన విశ్వ‌రూపం 2 ఆడియో వేడుక హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, చెన్నై నుండి హైద‌రాబాద్‌కి వ‌స్తున్న క్ర‌మంలో రానా క‌మ‌ల్‌తో సెల్ఫీ దిగి ఉంటార‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. రానా ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంటే, క‌మ‌ల్ విశ్వ‌రూపం 2 చిత్రం ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 2013లో వచ్చిన ‘విశ్వ‌రూపం ’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ చిత్రానికి కొనసాగింపుగా విశ్వ‌రూపం 2 చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు