ర‌మ్య‌కృష్ణ పార్ట్ పూర్తైంద‌న్న మారుతి

అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైలజా రెడ్డి అల్లుడు అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా, ఆగ‌స్ట్‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. చిత్రంలో క‌థానాయిక‌గా అనుఎమ్మాన్యుయేల్ న‌టిస్తుండ‌గా, అత్త పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. అయితే తాజాగా ర‌మ్య‌కృష్ణ‌కి సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ముగిసింద‌ని మారుతి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. త‌న‌కి న‌చ్చిన న‌టితో పనిచేయ‌డం అద్భుతంగా ఉంద‌ని కొనియాడాడు. అంతేకాదు త‌న డైరెక్ష‌న్ టీం ర‌మ్య‌కృష్ణ‌తో క‌లిసి ఫోటో దిగారు. ఈ ఫోటో అభిమానుల‌ని అల‌రిస్తుంది. శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పాత్ర పోషించిన ర‌మ్య‌కృష్ణ దేశ‌వ్యాప్తంగా ఏ రేంజ్ క్రేజ్ అందుకుందో తెలిసిందే.
× RELATED గతంలో నెరవేర్చిన విధంగానే ఈసారి కూడా: కేసీఆర్