ప్రేమ కోసమే..

రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం హలో గురు ప్రేమ కోసమే. దిల్‌రాజు నిర్మాత. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలు. ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ వినోదభరిత ప్రేమకథా చిత్రమిది. మామాఅల్లుళ్ల పోరు నేపథ్యంలో ఆద్యంతం సరదాగా సాగుతుంది. ప్రేమకోసం ఓ యువకుడు ఏం చేశాడన్నది ఆసక్తిని పంచుతుంది. రామ్, ప్రకాష్‌రాజ్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశం అలరిస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసి దసరా సందర్భంగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: విజయ్.కె. చక్రవర్తి, కళ: సాహి సురేష్, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, రచనా సహకారం: సాయికృష్ణ.