పసుపు కుంకుమ తీసుకొని ఉప్పుకారం పూసిన ఏపీ మహిళలు

అమరావతి: ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఇప్పటికే సైకిల్ టైర్ పంక్చర్ అయిందంటూ పోస్ట్ పెట్టిన వర్మ.. తాజాగా మరికొన్ని పోస్టులు వేశారు. పసుపు కుంకుమ తీసుకొని ఏపీ మహిళలు ఉప్పుకారం రాశారని వర్మ ట్వీట్ చేశారు. టీడీపీ పుట్టింది 29 మార్చి 1982న అయితే.. 23 మే, 2019న చచ్చిపోయింది. టీడీపీ చచ్చిపోవడానికి అబద్ధాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, వైఎస్ జగన్, నారా లోకేశ్.. అంటూ సెటైర్ ట్వీట్ చేశారు వర్మ.