వినయ విధేయ రామ

రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. కైరా అద్వాణీ కథానాయిక. ఈ సినిమా టైటిల్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి నటించిన స్టేట్‌రౌడీ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టబోతున్నారని ప్రచారం జరిగింది. తాజాగా వినయ విధేయ రామా అనే టైటిల్‌ను ఎంపికచేశారని వార్తలు వినిపిస్తున్నాయి. జయ జానకి నాయకా పేరుతో గతంలో బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ చిత్రానికి కూడా అదే తరహాలో క్లాస్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం. నిర్మాత డీవీవీ దానయ్య ఫిలిం ఛాంబర్‌లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. దీంతో రామ్‌చరణ్ తాజా సినిమా టైటిల్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది.

× RELATED వరుణ్‌ని చూస్తే ఈర్షగా వుంది!