పాకిస్థాన్ నుంచి ప్రేమతో.. మోదీకి రాఖీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాఖీ సిస్టర్ ఖమర్ మోసిన్ షేక్ ఈసారి కూడా తన అన్నకు రాఖీ కట్టడానికి పాకిస్థాన్ నుంచి ఢిల్లీ వచ్చారు. 24 ఏళ్లుగా.. అంటే మోదీ ఓ సాధారణ ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్న సమయం నుంచి ఆయనకు రాఖీ కట్టడం అలవాటు మార్చుకున్నారు ఖమర్ మోసిన్. గత రెండున్నర దశాబ్దాలుగా ఆయన ఏమాత్రం మారలేదని ఈ సందర్భంగా ఖమర్ చెప్పారు. ఆయన ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్న సమయం నుంచి నాకు తెలుసు. 24 ఏళ్లుగా రాఖీ కడుతూనే ఉన్నాను. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. కాకపోతే ఆయన ఇప్పుడు కాస్త బిజీ కావడంతో తక్కువ సమయం గడుపుతున్నారు అని ఖమర్ అన్నారు. ఖమర్ పాకిస్థాన్‌కు చెందిన మహిళ. అయితే పెళ్లి తర్వాత ఇండియా వచ్చిన ఆమె.. ఇక్కడే సెటిలయ్యారు. ఓ కార్యకర్త స్థాయి నుంచి కఠోర శ్రమ, ముందు చూపుతో ఆయన ప్రధాని పదవి చేపట్టే స్థాయికి చేరారని ఖమర్ చెప్పారు. అంతకుముందు రాఖీ సందర్భంగా పలువురు మహిళలు కూడా ప్రధాని మోదీకి ఆయన నివాసంలో రాఖీలు కట్టారు.

Related Stories: