ఫిలిం ఫెస్టివల్‌కు ‘సంజూ’ స్నేహితుడు..డైరెక్టర్

ముంబై: బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, నటుడు విక్కీ కౌశల్ అరుదైన గౌరవం అందుకోనున్నారు. మెల్‌బోర్న్‌లో జరుగనున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం)కు హిరానీ, విక్కీ ముఖ్యఅతిథులుగా హాజరవనున్నారు. హిరానీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సంజూ’ ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రదర్శన కేటిగిరీల్లో ఐఐఎఫ్‌ఎం అవార్డ్సుకు నామినేట్ అయింది.

ఆగస్టు 10 నుంచి 22 వరకు ఫిలిం ఫెస్టివల్ జరుగనుంది. మెల్‌బోర్న్ లా ట్రోబ్ యూనివర్సిటీలో కూడా సంజూను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ప్రత్యేక ప్రదర్శనలు, పోటీలు, ప్యానెల్ చర్చలు, ఇతర కార్యక్రమాలతో ఐఎఫ్‌ఎఫ్‌ఎం కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో తెరకెక్కించిన సినిమాలు ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. మసాన్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విక్కీ కౌశల్ ‘సంజూ’ చిత్రంలో స్నేహితుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Related Stories: