‘పేటా’ పోస్టర్..సిమ్రన్ ఈజ్ బ్యాక్

తమిళసూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం పేటా. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అందాల తార సిమ్రన్, త్రిష, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా పేటా నుంచి రజినీ, సిమ్రన్ లుక్ ఒకటి విడుదలైంది.

పోస్టర్‌లో రజినీకాంత్, సిమ్రన్ తమ చేతుల్లో పూల మొక్కలు పట్టుకుని జనాల మధ్యలో నుంచి పరుగెత్తుతున్నారు. రజినీ, సిమ్రన్ ఏ మాత్రం చరిష్మా తగ్గకుండా హుషారుగా నవ్వుతూ పారిపోతున్న స్టిల్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ పోస్టర్‌లో అభిమానులు పాత రజినీ, సిమ్రన్లను చూసి మురిసిపోతున్నారు. ఈ పోస్టర్ ఇపుడు ఆన్‌లైన్‌లో వైరలవుతోంది. కళానిధి మారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను నిర్మిస్తోంది. 2019 జనవరిలో సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Stories: