విల్లాకి ర‌జనీకాంత్ పేరు పెట్టిన రిసార్ట్ నిర్వాహ‌కులు

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను విభిన్న క‌థా చిత్రాల‌ని చేస్తున్న ర‌జ‌నీకాంత్ సినిమాలంటే ప్రేక్ష‌కుల‌లో ఉన్న ఆస‌క్తి అంతా ఇంతా కాదు. ఇటీవ‌ల కాలా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌జ‌నీ ప్ర‌స్తుతం కార్తీక్ సుబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ డార్జిలింగ్‌లో జ‌రుగుతుంది. అయితే షూటింగ్ నిమిత్తం క్యురీసెంగ్ అనే ప్రాంతంలోని అల్లిటా అనే రిసార్ట్‌లో ఉన్న రూమ్ నెంబ‌ర్ 3లో ప‌ది రోజులుగా ఉంటున్నారు త‌లైవా. ఆయ‌న ఉన్నార‌ని తెలుసుకున్న అభిమానులు రిసార్ట్‌కి బారులు తీరారట‌. ర‌జ‌నీతో క‌లిసి కొద్ది మంది ఫోటోలు కూడా దిగార‌ని తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్‌లోను ర‌జ‌నీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని చూసిన రిసార్ట్ ఓన‌ర్స్ ఖంగు తిన్నార‌ట‌. అంతేకాదు తాను ఉన్న విల్లాకి ర‌జనీకాంత్ విల్లాగా పేరు పెట్టార‌ట‌. అలాగే అక్కడ రజనీకాంత్‌కి నచ్చిన టీను ‘తలైవర్‌ స్పెషల్‌’గా ఇక మీదట సర్వ్‌ చేయనున్నారు. ఇక విల్లాలో బస చేసినందుకు గుర్తుగా రజనీకాంత్‌ ఆ రిసార్ట్‌లో ఒక మొక్కను నాటడం విశేషం. ర‌జ‌నీకాంత్ మ‌రి కొద్ది రోజులు షూటింగ్ కోసం అక్క‌డే ఉండ‌నున్నారు. చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషించ‌నుండ‌గా, ఈ సినిమా బాక్సాఫీస్‌ని బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి