మేలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ర‌జ‌నీకాంత్ కొత్త చిత్రం

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన కాలా, 2.0 చిత్రాలు విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా ఆయ‌న 168వ చిత్రం మేలో సెట్స్‌పైకి వెళ్ళ‌నుంద‌ని తెలుస్తుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని జిగ‌ర్తాండ ఫేం కార్తీక్ సుబ్బ‌రాజు తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించేందుకు ముగ్గురు హీరోయిన్స్‌ని పరిశీలిస్తున్నార‌ట‌. దీపికా ప‌దుకొణే, త్రిష‌, అంజ‌లి ప్ర‌స్తుతం రేసులో ఉన్నారు. వీరి ముగ్గురిలో ఓ భామని క‌థానాయిక‌గా ఫైనల్ చేసే చాన్స్ ఉంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌జ‌నీకాంత్ 45 రోజులు డేట్స్ కేటాయించాడ‌ట‌. గ‌త‌వారం ర‌జ‌నీకాంత్ ఇంటికి వెళ్ళి ఆయ‌న కాల్షీట్స్ గురించి ద‌ర్శ‌కుడు డిస్క‌స్ చేసారు. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని తెరకెక్కించనుంది. చిక్కడు దొరకడు, పిజ్జా తోపాటు పలు హిట్ చిత్రాలను తీసిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించాలని భావిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్ర‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు.

Related Stories: