కార్తీక్‌ సుబ్బరాజుతో రజినీ కొత్త సినిమా

చెన్నై : తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 2.0, కాలా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాలా సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తలైవా ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు విడుదల కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో రజినీకాంత్ కొత్త సినిమా ఫైనల్ చేశాడు. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని తెరకెక్కించనుంది. ఈ విషయాన్ని సన్ ఫిక్చర్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కార్తీక్ సుబ్బరాజ్ చిక్కడు దొరకడు, పిజ్జా తోపాటు పలు హిట్ చిత్రాలను తీశాడు.

Related Stories: