ఈఆర్వో నెట్ వచ్చాక బోగస్ ఓట్లు తగ్గాయి..

హైదరాబాద్ : ఓటర్ల నమోదు ప్రక్రియ, బోగస్ ఓట్ల తొలగింపు వేగంగా కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. సచివాలయంలో రజత్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితా అభ్యంతరాలు స్వీకరిస్తాం. చిరునామా మార్పునకు 25 వ తేదీ వరకు సమయం ఇచ్చాం. ఓటర్ నమోదు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. 17 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. యువత కూడా పెద్దఎత్తున ఓటర్ నమోదు చేసుకుంటున్నారు. ఓటర్ల తొలగింపు పక్రియ కూడా జరుగుతుంది. ఓటర్ నమోదుపై ఎవరికీ ఎలాంటి అపోహ వద్దు. ఓటర్ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఓటర్ల జాబితా సవరణ జాబితా కోసం రూపొందించిన కొత్త ఈఆర్వోనెట్ పై అధికారులకు అవగాహన కల్పించాం. ఈఆర్వోనెట్ ద్వారా 100 శాతం నకిలీ ఓట్లను తొలిగిస్తున్నారన్నారు.

చనిపోయిన వారి ఓట్లు కూడా తొలిగిస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. బోగస్ ఓట్ల ఏరివేత జరుగుతుంది, ఈవీఎంలు 23 జిల్లాలకు చేరుకున్నాయి. ఈ నెల 22 తేదీ వరకు అన్ని జిల్లాలకు చేరుకుంటాయి. బీఎల్ ఓలు అందరిని అపాయింట్ చేస్తున్నాం. వారికి శిక్షణ కూడా ఇస్తున్నాం. ఎన్నికల అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనింగ్ కోసం ఢిల్లీ కి పంపిస్తున్నాం. ఈఆర్వో నెట్ వచ్చాక బోగస్ ఓట్లు తగ్గాయి, ఫొటోలు, పేర్లు ఒకే విదంగా ఉన్న లక్షా యాభై వేల ఓట్లు గుర్తించాం. ఓటర్ నమోదు కోసం చాలా ప్రచారం చేశాం. మంచి ఫలితం వస్తుంది.నేమ్ ఆడిషన్ కోసం కొంత సమయం కావాలి. 32,574 మంది బీఎల్ ఓలు ఉన్నారు. సీఈఓ సైట్ లో ఉన్న జాబితా తుది జాబితా. ప్రతిపక్ష పార్టీలకు నేను చెప్తున్న ఓట్ల తొలగింపు, చిరునామా మార్పు కోసం సమయం ఇచ్చామన్నారు.

ఓటర్ నమోదు మాత్రం ఎన్నికల గడువు వరకు చేసుకోవచ్చన్నారు. మన రాష్ట్రంలో 52,100 ఈవీఎంలు, 39,470 వీవీ ఫ్యాట్లు అవసరం. ఈవీఎంలలో ఓట్లు వేస్తే ఒకే పార్టీ కి పడుతున్నాయి అనేది సరైనది కాదన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ వారు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రజత్ కుమార్ సూచించారు. రాజకీయ పార్టీల ముందే మాక్ పోలింగ్ చేస్తాం. ఇది అంతా రికార్డింగ్ జరుగుతుంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం వారు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఎన్ని ఓట్లు తీసుకోవాలి అని కొన్ని నియోజకవర్గంలోకి వాటిని పంపిస్తున్నాం.ప్రజలు,పార్టీల నాయకుల ముందే మాక్ పోలింగ్ చేస్తాం. ఈవీఎంల పనితీరు పై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు.

Related Stories: