20 రోజుల సెలవు రద్దు చేసుకున్న రజత్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు (జిల్లా ఎన్నికల అధికారులు), డిప్యూటీ కలెక్టర్లతో హైదరాబాద్ లో రజత్ కుమార్ సమావేశమయ్యారు. ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల పనితీరుపై ప్రాథమికంగా చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయన 20 రోజుల సెలవును రద్దు చేసుకున్నారు. తగినన్ని ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సీఈసీని కోరారు.

32,574 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటికి ఇంకా ఎన్ని ఎక్కువ తీసుకోవాలనేది నిర్ణయం కాలేదన్నారు. రాష్ట్రానికి 52,100 బ్యాలెట్ యూనిట్లు, 40,700 కంట్రోల్ యూనిట్లు, 44 వేలు వీవీ ప్యాట్లు సమకూర్చాలని కోరామని రజత్ కుమార్ తెలిపారు. ఈ నెల 12 కల్లా రాష్ట్రానికి ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపు పూర్తవుతుందని ఆయన చెప్పారు. గోదాములు ఉన్నాయని, అవసరమైన సిబ్బందిని కూడా ఇస్తున్నారని తెలిపారు.

Related Stories: