నామినేషన్ దాఖలు చేసిన వసుంధర రాజే

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే.. ఎన్నికల నామినేషన్ పత్రాన్ని జలావర్ సెక్రటేరియట్‌లో దాఖలు చేశారు. వసుంధర రాజే జల్రాపటాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అంతకు ముందు అక్కడి బాలాజీ టెంపుల్‌లో వసుంధర రాజే ప్రత్యేక పూజలు చేసి అర్చకుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వసుంధర రాజే వెంబడి బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ కూడా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా రాజే నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో షానవాజ్ ఉన్నారు. రాజ‌స్థాన్ అసెంబ్లీకి డిసెంబ‌ర్ 7న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Related Stories: