టీఆర్‌ఎస్‌తోనే దళితులకు గౌరవం

జమ్మికుంట: టీఆర్‌ఎస్ పార్టీ అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పించిందనీ, దళితులకు తగిన గౌరవం దక్కిందని జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఇమ్మడి సతీశ్ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ విజయ, ఎంపీపీ దొడ్డె మమత, జడ్పీటీసీ శ్రీరాంశ్యాంను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడారు. చైర్ పర్సన్‌గా తనకు, జడ్పీటీసీగా శ్యాం, ఎంపీపీగా మమతకు మంత్రి రాజేందర్ చొరువతోనే పదవులు దక్కాయనీ, ఈటలకు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామనీ, ప్రజా సమస్యలపై స్పందిస్తామని తెలిపారు. మంత్రి అందించే నిధులతో మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తమను ఆశీర్వదించి, గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నాయకులు, హెల్త్ సిబ్బంది, తదితరులున్నారు.
More