ప్రశాంతంగా నిర్వహిద్దామ

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామని సిరిసిల్ల, వేములవాడ కమిషనర్లు కేవీ రమణాచారి, గంగారామ్ పేర్కొన్నారు. అన్ని పార్టీల నాయకులతో వారు బుధవారం వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల టౌన్ : మున్సిపల్ ఎన్నికలు సజావు గా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నే తలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి కోరారు. మున్సిపల్ కార్యాలయం లో815
- కమిషనర్లు కేవీ రమణాచారి, గంగారామ్ - మున్సిపల్ ఎన్నికలపై అఖిల పక్ష సమావేశం - సిరిసిల్లలో 117, వేములవాడలో 57 పోలింగ్ కేంద్రాలు - 19 వరకు అభ్యంతరాల స్వీకరణ
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామని సిరిసిల్ల, వేములవాడ కమిషనర్లు కేవీ రమణాచారి, గంగారామ్ పేర్కొన్నారు. అన్ని పార్టీల నాయకులతో వారు వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలుంటే 19వ తేదీలోగా తెలపాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. బుధవారం అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతో కలుపుకుని మొత్తం 39 వార్డులకు గానూ 117 పోలింగ్ బూ త్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయా వార్డుల్లో అనువుగా ఉన్న కమ్యూనిటీ భవనాలు, మెప్మా కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలల్లో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించా రు. పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేశామని, ఇందులో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19వ తేదీ సాయంత్ర 5గంటల లోపు స్థానిక ప్ర జాప్రతినిధులు మున్సిపల్ కార్యాలయంలో రాత పూర్వకం గా వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. అభ్యంతరా పరిశీలన అ నంతరం 20న తుది జాబితాను ప్రకటిస్తామని తె లిపారు. 3వ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేం ద్రాన్ని 5వ వార్డులో గల మెప్మా కార్యాలయంలో ఏర్పాటుచేయడంపై స్థానిక కాంగ్రెస్ నేత ప్రవీణ్ అభ్యంతరం తెలిపారు. వార్డుకు సంబంధం లే కుండా ఇతర వార్డులో పోలింగ్ బూత్ ఉండ డం తో ఓటర్లకు ఇబ్బందులు ఎదురవుతాయని, బూ త్ మార్పునకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రత్యామ్నాయ ఏ ర్పాటు కు పరిశీలిస్తామని కమిషనర్ తెలిపారు. నే డు సినారె కళామందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ శిబిరం ఏ ర్పాటుచేశామన్నారు. సమావేశంలో మున్సిపల్ టీపీఎస్ వరుణ్, నాయకులు సంగీతం శ్రీనివాస్, తీగల శేఖర్‌గౌడ్, మచ్చ ఆంజనేయులు, మ్యాన రవి, తుమ్మ రాజు, తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో 57 పోలింగ్ కేంద్రాలు వేములవాడ, నమస్తేతెలంగాణ: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ గంగారామ్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలు, వాటి అభ్యంతరాలపై ఆయన రాజకీ య పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. వేములవాడ మున్సిపాలిటీలో 57 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటుచేశామన్నారు. వీలినమైన శా త్రాజుపల్లి, అయ్యోర్‌పల్లి, తిప్పాపూర్, కోనాయపల్లి, నాంపల్లి గ్రామాలతో కలిపి వేములవాడ ము న్సిపాలిటీలో 28వార్డులు ఉండగా వార్డుకు 2 పో లింగ్ కేంద్రాల చొప్పున 56 ఏర్పాటుచేస్తున్నామన్నారు. 2వ వార్డులో పరిధిని దృష్టిలో పెట్టుకొని అదనంగా పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటుచేశామన్నా రు. పోలింగ్ కేంద్రాలపై నాయకులు ఎవరూ అ భ్యంతరాలు తెలుపలేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నారం శ్రీనివా స్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సాగరం వెంకటస్వామి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కూరగాయ ల శ్రీశైలం, టీడీపీ పట్టణాధ్యక్షుడు ముప్పిడి శ్రీధ ర్, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
More