815 మందిపై అనర్హత వేటు

-ఉమ్మడి జిల్లా నేతలపై ఈసీ కొరడా -మూడేళ్లపాటు పోటీకి అనర్హులు (కార్పొరేషన్, నమస్తే తెలంగాణ)అన్ని నగరపాలక, పురపాలక సంస్థలో ఎన్నికల సందడి నెలకొన్న వేళ 2014 ఎన్నికల్లో పోటీలో ని లబడి ఎన్నికల సంఘానికి లెక్కలు అప్పగించిన అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. ఈ విషయంలో గతేడాదే ఓ జాబితా ప్రకటించింది. కాగా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తుండడంతో మరోసారి జా బితా విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం రెండు నగరపాలక సంస్థలతో పాటు కొత్త గా ఏర్పడ్డ వాటితో కలిపి మొత్తం 14 మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో లెక్కలు చూపని ఉమ్మడి జిల్లాకు చెందిన 815 మందిని అ నర్హులుగా తేల్చారు. ఇందులో అత్యధికంగా రామగుం డం కార్పొరేషన్ పరిధిలో 363 మంది ఉండ గా, అత్యల్పంగా హుజూరాబాద్‌లో ఒకరు ఉన్నా రు. ఆయా జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 132 మంది, జమ్మికుంటలో 34 మంది, హుజూరాబాద్‌లో ఒకరు చొప్పున మొత్తం 167 మంది ఉన్నారు. జగిత్యాలలో 81 మంది, కో రుట్లలో 93 మంది చొప్పున మొత్తం 174 మంది ఉన్నారు. పెద్దపల్లిలో 36 మంది, రామగుండంలో 363 మంది చొప్పున మొత్తం 399 మంది ఉన్నా రు. సిరిసిల్లలో 16 మంది, వేములవాడలో 59 మంది చొప్పున మొత్తం 75 మంది ఉన్నట్లు ప్రకటించారు. వీళ్లు గత ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా పోటీచేసి ఓడిపోయినా ఎ న్నికల ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి అం దించలేకపోయారు. ఈ విషయంలో గత ఏడాదిలో చివరిసారిగా లెక్కలు అప్పగించేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అయినా కొందరు అ భ్యర్థులు తమ లెక్కలను అప్పగించకపోవడంతో 2020 వరకు వారు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. దీం తో ఆయా నాయకులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పో టీ చేసే అవకాశం లేకుండా పోయింది.
More