రోడ్లపై చెత్త వేస్తే

భారీ జరిమానాలు: కమిషనర్ సిరిసిల్ల టౌన్: రోడ్లపై చెత్త వేసినా, కాల్చినా భారీగా జరిమానాలు విధిస్తా మని మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి హెచ్చరించారు. స్థానిక విలేకరు లతో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌వో నంబర్1357(ఈ)తేదీ08-04-2016లో భాగంగా చెత్తను ఉత్పత్తి చేసే వారు ఎవరైనా ఇంటి బయటకానీ, వీధుల్లో కానీ, ఖాళీ స్థలాల్లో పడవేయడం, కాల్చడం చేస్తే చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. అదే విధంగా కుంటలు, చెరువులు, మురికి కాలువల్లో వ్యర్థాలు పడవేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బహిరంగంగా చెత్తను కాల్చిన వ్యక్తులకు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చ ర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
More