తెరుచుకున్న రాజన్న ఆలయం

-చంద్రగ్రహణం అనంతరం శాస్ర్తోక్తంగా సంప్రోక్షణ -స్వామివారికి అర్చకుల ప్రత్యేక పూజలు విధుల్లో పారదర్శకత పాటించాలి -జడ్పీ సీఈవో గౌతంరెడ్డి -ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన కార్యదర్శులకు శిక్షణ ఎల్లారెడ్డిపేట: విధుల్లో పారదర్శకత పాటించాలని ఇటీవల బాధ్యతలను చేపట్టిన పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పరిషత్ సీఈవో గౌతంరెడ్డి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు ను బుధవారం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించాలని, లే అవుట్లలో అక్రమాలకు తావివ్వవద్దని, హరితహారంపై దృష్టిని కేంద్రీకరించి విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. కొత్తపంచాయతీరాజ్ చట్టం మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి పనులు చేస్తే గ్రామపంచాయతీ పాలకవర్గం మొత్తంపై కూడా చర్యలు తీసుకునే ప్ర మాదం ఉన్నందున పాలనలో పారదర్శకత పాటించాలని అన్నా రు. ఇంటిపన్నులు, నల్లాబిల్లులు బకాయిలు లేకుండా చూడాలని తెలిపారు. ప్రతీ ఇంటిలో తడి, పొడి చెత్తను వేరుచేసి రీసైకిల్ చేసుకునే విధంగా ప్రజలకు పూర్తిగా తెలియపరిచే బాధ్యతను యువ తీ, యువకులైన నూతన కార్యదర్శులు ఉత్సాహంగా గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణలో ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో హరితహరంకోసం నర్సరీని నిర్వహించాలనే నిబంధనను విస్మరించరాదని, మొక్కలు పెంచడంపై దృష్టిపెట్టాలని తెలిపారు. ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనులతో పూర్తి గ్రామస్వరూపాన్ని మార్చేయవచ్చుననే విశయాన్ని గ్రామస్తులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ స్వామి, ఎంపీడీవో చిరంజీవి, ఈవోపీఆర్డీ పీవీ రాజశేఖర్, శ్రీనివాస్, రాజిరెడ్డి, వైద్యసిబ్బంది లింగం, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
More