భూ సమస్యలపై జాప్యం వద్దు

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో భూ సమస్యల పరిష్కారంపై జాప్యం చేయవద్దని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు సూచిం చారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూ రికార్డుల ప్రక్షాళనపై తాసిల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఫీల్డ్ వర్క్ చేయడంతో పాటు విచారణ పూర్తి చేసి ఫైళ్లను లాగిన్‌లో నమోదు చేయాలన్నారు. కోర్టు కేసులు లేని భూ సమస్యలను వెంటనే పరిష్కరిం చి సంబంధిత రైతులకు పాసు పుస్తకాలు పంపిణి చేయాలన్నారు. డిజిటల్ సంతకాలు పూర్తి చేయాలన్నారు. పట్టాదారు చనిపోయినా, భూ క్రయవి క్రయాలపై వెంటనే మ్యూటేషన్ చేయాలన్నారు. జిల్లాలోని రైతుల ఖాతాలను ఆధార్‌తో అనుసంధా నం చేయాలన్నారు. పట్టాదారు పుస్తకాలు సిద్దంగా ఉండి, రైతులు అందుబాటులో లేకుంటే సమాచారం ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అం దజేయాలన్నారు. గ్రామాల వారీగా రైతుల జాబితాలు సిద్ధ్దంగా ఉంచాలన్నారు. రైతులకు మేలు కలిగే విధంగా పనితీరు మెరుగుపరుచకోవాలని తాసిల్దార్లను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్వర పరిష్కారానికే రైతు మాట.. కేవలం భూ సమస్యల పరిష్కారానికి మాత్రమే రైతు మాట సహయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామనీ, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహాయ కేంద్రంలో నమోదు చేసుకునే అధికారులు సంబంధిత మండల తాసిల్దార్లకు పంపిస్తారని, విచారణ చేసి 48 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. పరిష్కా రం కాకుంటే ఎందుకు కాలేదో రైతులకు సమాచా రం ఇవ్వాలన్నారు. సమావేశంలో జేసీ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీఓలు ఆనంద్‌కుమార్, చెన్నయ్య పాల్గొన్నారు.
More