యువకుడికి రామన్న భరోసా

-రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీవైనగర్ వాసి -వైద్యఖర్చులకు ఎదురుచూపులు -ట్విట్టర్ ద్వారా విషయం కేటీఆర్ దృష్టికి -వెంటనే స్పందించిన ఎమ్మెల్యే -సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.76లక్షల ఎల్‌వోసీ మంజూరు
సిరిసిల్లటౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపైన యువకుడికి ఎమ్మెల్యే కేటీఆర్ భరోసాగా నిలిచారు. మెరుగైన వైద్యం కోసం ము ఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2.76లక్షలు ఎల్‌వోసీ మంజూరు చేయించి రామన్న మరోమారు తన ఔదార్యం చాటుకున్నారు. వి వరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌కు చెందిన గుల్లె శివ(20) వ్యక్తిగత పనినిమిత్తం రెండ్రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై స్నేహితుడితో కలిసి తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంతో శివకు తీవ్రగాయాలవగా కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని మెడికేర్ హాస్పిటల్ కు తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్య ఖర్చులకు రూ.2.76లక్షలు అవసరమని సూచించారు. దీంతో నిరుపే ద నేతకార్మికుడైన శివ తండ్రి బుచ్చిలింగం దిక్కుతోచని స్థితిలో పడి పోయాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్‌ఎస్ నేత గడ్డం భాస్కర్ శివ పరిస్థితిని ట్విట్టర్ ద్వారా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన రామన్న యువకుడి కుటుంబానికి భరోసా ఇచ్చారు. వైద్యఖర్చులకు అవసరమైన రూ.2.76లక్షలు సీఎం సహా య నిధి(ఎల్‌వోసీ) ద్వారా మంజూరు చేయించారు. ఎమ్మెల్యే కేటీఆర్ ఆపద్బాంధవుడిలా తమ కుటుంబాన్ని ఆదుకున్నారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉం టామని శివ కుటుంబీకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related Stories: